సోమశిల జలాశయ రక్షణ పనుల్లో కదలిక: త్వరలో గేట్ల మార్పు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆత్మకూరు
సోమశిల జలాశయం నిర్వహణ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చిందని ఈఈ శ్రీనివాసకుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రక్షణ కట్టడాల నిర్మాణం, కండలేరు వరదకాలువ రెగ్యులేటర్ పనులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో పనులను వేగవంతం చేశామని, క్రస్ట్ గేట్ల రోప్‌లను మార్చే పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.