మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి: హైదరాబాద్ పోలీస్ కీలక పిలుపు
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయని, భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని హైదరాబాద్ సిటీ పోలీస్ స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 8712671111 కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరారు.