హైదరాబాద్ లో అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మహానగరంలో అకస్మాత్తుగా వాతావరణం మారి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వేళ దట్టమైన మేఘాలు అలుముకోవడంతో కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్, జగద్గిరిగుట్ట, సూరారం, బహదూర్‌పల్లి, దుండిగల్ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.