ప్రభుత్వమే కబ్జాకోరుగా మారింది: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Telangana

సింగరేణిలో వేలాది ఇళ్లను 22A జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సొంత ఇళ్లు కట్టుకున్న బాధితులను కబ్జాదారులుగా ముద్ర వేయడం దారుణమన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జాకోరుగా మారిందని, రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.