కాంట్రాక్ట్ కార్మికుడి మృతిపై కలెక్టరేట్ ఎదుట నిరసన

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖ కలెక్టరేట్ ఎదుట కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టి కలెక్టరుకు బాధితులు, నాయకులు మెమొరాండం అందజేశారు. జీవీఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడు చెట్టు కొడుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు పడి మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని నాయకులు వై.రాజు, ఎం.సుబ్బారావు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.