మామునూరు ఎయిర్‌పోర్ట్ టెండర్లు ఖరారు కాకతీయ శైలిలో నిర్మాణం
రిపోర్టర్: రమేష్
స్థలం: వరంగల్
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.213.59 కోట్లతో కీలకమైన టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కాకతీయ శైలి డిజైన్లతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. నవంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి కానుండగా, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.