తిరుమల భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికత రూపకల్పన
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుపతి
తిరుమలలో భక్తుల రద్దీని అదుపు చేయడానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆచార్యురాలు టి.శోభారాణి కృత్రిమ మేధ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సాంకేతికతను రూపొందించారు. సీసీటీవీలు, డిజిటల్ అనలిటిక్స్, ఐవోటీ పరికరాలను సమన్వయం చేస్తూ భక్తుల కదలికలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. క్యూలైన్లలో అసాధారణ పరిస్థితులను గుర్తించి అధికారులను అప్రమత్తం చేసే ఈ సాంకేతికతకు పేటెంట్ హక్కులు కూడా లభించాయి.