క్వారీ పబ్లిక్ హియరింగ్ లో ఎన్జీవోల వీరంగం: పోలీస్ స్టేషన్ ఎదుటే డబ్బుల కోసం రభస
రిపోర్టర్: వెంకట్
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో నల్ల రాయి క్వారీ ఏర్పాటుకు సంబంధించిన పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్జీవోల తీరు తీవ్ర వివాదాస్పదమైంది. క్వారీ యాజమాన్యం తమకు అనుకూలంగా మాట్లాడినందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు మూడు వందల మంది ఎన్జీవోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా నడిరోడ్డుపై రభస సృష్టించారు. ఈ వ్యవహారంపై స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముక్కున వేలేసుకుంటున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.