డైరెక్టర్ రాజీనామా వార్తలను ఖండించిన ఐఐటీ బాంబే

రిపోర్టర్: సునీల్ స్థలం: మహారాష్ట్ర

ఐఐటీ బాంబేలో విద్యార్థి సాిల్ వాకోడే ఆత్మహత్య ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఐటీ బాంబే అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టతనిస్తూ, డైరెక్టర్ రాజీనామా చేశారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.