రాప్తాడు సాహస బాలిక లక్ష్మికి జాతీయ అవార్డు సిఫారసు: అండగా నిలుస్తామన్న లోకేష్

రిపోర్టర్: గోపి స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన బాలిక లక్ష్మి పేరును జాతీయ సాహస బాలిక అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మి చూపిన సాహసం నిజమైన స్నేహానికి నిదర్శనమని మంత్రి కొనియాడారు.