కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై మల్లికార్జున ఖర్గే నిప్పులు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యున్నత సమావేశం కానున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల సంఘం వివాదాస్పద నిర్ణయాలు, వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్న ఈ భేటీలో భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.