స్వామివారి సేవగా భావించి విధులు నిర్వర్తించాలని ఎస్పీ పిలుపు

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి అర్బన్

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బందోబస్తును సాధారణ విధిగా కాకుండా సాక్షాత్తు శ్రీవారికి చేసే సేవగా భావించి పోలీసులు భక్తిశ్రద్ధలతో విధులు నిర్వర్తించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా ఆరు వేలకు పైగా పోలీసు సిబ్బందితో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులతో ఓర్పుగా వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.