ఘనంగా మీడియా అకాడమీ చైర్మన్ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, మాజీ ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే. శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ప్రకాష్‌గౌడ్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.