ఒమాహాలో ఘనంగా నిర్వహించిన తెలుగు సమితి సేవా కార్యక్రమం

రిపోర్టర్: రాము స్థలం: Omaha

ఒమాహా నగరంలోని సీనా ఫ్రాన్సిస్ వేదికగా తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో ‘ఫీడ్ ది నీడ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. TSN అధ్యక్షులు కొల్లి, చారిటీ కమిటీ చైర్ ధనారావు గొట్టిపాటి, కమ్యూనిటీ కమిటీ చైర్ అవినాష్‌ల సమన్వయంతో యువత ఈ సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఆశ్రమంలోని జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన యువ వాలంటీర్లు సమాజం పట్ల తమ బాధ్యతను, కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు.