యూజీసీ 2026 నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ ఆగ్రాలో నిరసనలు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆగ్రా
యూజీసీ 2026 కొత్త నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరసనకారులు ఆగ్రాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేను దిగ్బంధించారు. ఖందౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌడి కూడలి వద్ద గుమిగూడిన ఆందోళనకారులు ట్రాక్టర్లతో జిల్లా ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై బైఠాయించి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు జోక్యం చేసుకుని వారిని సముదాయించడంతో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది.