అభిషేక్ శర్మకు వన్డే జట్టులో చోటు ఎందుకు ఇవ్వట్లేదు: సెలెక్టర్లను నిలదీసిన యువరాజ్ సింగ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ వన్డే జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ లోనే కాకుండా నాయకత్వ లక్షణాలలోనూ ముందుంటున్నాడని, వైట్ బాల్ క్రికెట్ లో అతడు లెజెండరీ ఆటగాడిగా మారుతాడని యువీ ప్రశంసించారు. ఫామ్ లో ఉన్న కుర్రాళ్లను వన్డేలకు ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ సెలెక్టర్లను ఆయన సూటిగా నిలదీశారు.