అరెస్ట్ అయి నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చిన మద్యం అక్రమ రవాణా నిందితులు
రిపోర్టర్: నరేష్
స్థలం: జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు పోజులిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతనాగ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ నిందితులు పట్టుబడగా వారి వద్ద నుంచి 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే తీవ్రమైన నేరంలో పట్టుబడినప్పటికీ వారు ఎలాంటి భయం లేకుండా సంతోషంగా నవ్వుతూ ఉండటాన్ని నెటిజన్లు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు.