రవీంద్రభారతిలో అబ్బురపరుస్తున్న వేమనపల్లి కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సంపుటం గ్రామ శివారులో గుర్తించిన అరుదైన వృక్ష శిలాజాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఉంచారు. సుమారు ఇరవై కోట్ల నుంచి ఆరున్నర కోట్ల సంవత్సరాల కాలానికి చెందిన ఈ జురాసిక్ క్రిటేషియస్ శిలాజం ప్రత్యేక ఆకర్షణగా మారుతోందని అధికారులు తెలిపారు.