ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయవాడలో పీసీసీ రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమం ఉన్నందున, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఆందోళనను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ తెలిపారు. సోమవారం జరగాల్సిన ఈ నిరసనను అనివార్య కారణాల వల్ల మార్చామని, పార్టీ శ్రేణులు అందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన సోమవారం స్పష్టం చేశారు.