ఖమ్మం జిల్లాలో ఘోరం: బేతుపల్లి చెరువులో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

రిపోర్టర్: గోపి స్థలం: Khammam

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం లోని బేతుపల్లి చెరువులో గల్లంతైన మత్స్యకారులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. చెరువులో సహాయక చర్యలను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి మత్స్యకారులను రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రక్షించబడిన మత్స్యకారులతో కలెక్టర్ మాట్లాడి వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.