బ్రిక్స్ సదస్సు వేదికగా భారత్ దౌత్య బలాన్ని చాటాలి: కాంగ్రెస్

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

బ్రిక్స్ వేదికగా భారత్ తన దౌత్య బలాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్‌పై నమ్మకం పెంచాలని, ఇరాన్‌పై దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల విభాగం చీఫ్ సల్మాన్ ఖుర్షీద్ సూచించారు. బ్లాక్ రాజకీయాలకు దూరంగా ఉంటూ, పశ్చిమాసియా సంక్షోభంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.