కరువు సవాళ్ల ఎదుర్కొనేందుకు సూర్యాపేటలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: సూర్యాపేట
ఎల్నినో ప్రభావం మరియు వర్షపాతం లోటు నేపథ్యంలో తలెత్తే కరువు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమిష్టి కార్యాచరణ దిశగా అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో రైతులు అలాగే ప్రజలపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.