టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం: రిటైల్ స్టోర్లలో యాంటీ థెఫ్ట్ స్కానర్లు
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
రిటైల్ స్టోర్లలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ నూతన యాంటీ థెఫ్ట్ స్కానింగ్ పరికరాలను ప్రవేశపెట్టిందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ మార్క్ గుర్మన్ వెల్లడించారు. ఈ ప్రత్యేక పరికరం ద్వారా బాక్సులు తెరవకుండానే ఐఫోన్ల పనితీరును పరిశీలించవచ్చని, తద్వారా దొంగతనాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మోసగాళ్లు ఫోన్ విడిభాగాలను తొలగించి తిరిగి ప్యాక్ చేస్తున్న ఉదంతాల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.