కనివినీ ఎరుగని రీతిలో ఆర్యడన్ మహమ్మద్ అవార్డు అందుకున్న రేవంత్ రెడ్డి

రిపోర్టర్: సునీల్ స్థలం: Nilambur, Kerala / Hyderabad

కేరళ రాష్ట్రంలోని నిలంబూర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ఆర్యడన్ మహమ్మద్ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు 2026ను అధికారికంగా అందుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. ప్రజా సంక్షేమం, పరిపాలనలో అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ అవార్డు రావడం పట్ల రాష్ట్ర ప్రజలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.