ప్రాణాపాయంలో ఉన్న రోగికి రక్తమిచ్చి ప్రాణం పోసిన కాంగ్రెస్ నేత
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద రాజేష్ ఐదోసారి రక్తదానం చేసి ఆపదలో ఉన్న బాధితులకు భరోసా కల్పించారు. కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న రోగికి రక్తం అవసరమవడంతో రాజేష్ వెంటనే స్పందించి స్వయంగా వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.