కర్ణాటకలో దారుణం వివాహిత హత్య చిన్నారి రోదన

రిపోర్టర్: శివ స్థలం: కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు ఉపవిభాగ పరిధిలోని ఆర్హెచ్ క్యాంప్ ప్రాంతంలో స్నేహ అనే ఇరవై ఐదు సంవత్సరాల వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. పొలంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితురాలి మృతదేహంపై ఆమె ఏడాది చిన్నారి కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సింధనూరు గ్రామీణ పోలీసులు భర్త అమిత్, ప్రియుడు శుభమ్ లలో ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.