మెగా డీఎస్సీతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులనిచ్చిన లోకేష్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా కొత్త ఆశలు కల్పించిందని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో 16,000 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడం నిరుపేద కుటుంబాల యువతకు ఎంతగానో మేలు చేస్తుందని ఆయన కొనియాడారు.