రైల్వే ప్రయాణికులకు షాక్: రాత్రివేళల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లపై ఆంక్షలు జారీ
రిపోర్టర్: శివ
స్థలం: భారతదేశం
రైలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లపై భారతీయ రైల్వే కీలక ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ముందస్తుగా తమ పరికరాలను ఛార్జ్ చేసుకోవాలని సూచించారు.