అమెరికన్లకు ఐదు వేల డాలర్ల చెక్కులిస్తానన్న ట్రంప్

రిపోర్టర్: రమేష్ స్థలం: World

అమెరికాలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే పౌరులకు ఐదు వేల డాలర్ల చెక్కులు అందజేస్తామని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ ప్రణాళిక కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు. ఈ భారీ నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తాననే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని ట్రంప్ తేల్చిచెప్పడంతో అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.