విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కష్టాలు తీరేదెప్పుడు?
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
దక్షిణ తీర రైల్వే జోన్ కేంద్రంగా విశాఖపట్నం ఉన్నా, ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. రైళ్ల ఆలస్యం, ట్రాక్ సామర్థ్య లోపాలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. బల్బ్ లైన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం, స్టేషన్ పునరాభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.