రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామన్న సీఎం రేవంత్
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ రోడ్లు, బేగంపేట ఎయిర్పోర్ట్ టన్నెల్ రోడ్డు వంటి దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర పెద్దలను కలిసి పరిష్కరించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు వేగంగా చేయించుకుంటామని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తానని ఆయన వెల్లడించారు.