భీమ్గల్ పోలీస్ స్టేషన్లో తీవ్ర కలకలం: ఆత్మహత్యకు యత్నించిన టీ దుకాణదారుడు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Nizamabad

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఉదయం పి. సుధాకర్ అనే టీ దుకాణదారుడు బలవన్మరణానికి యత్నించినట్లు నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి. సాయిచైతన్య వెల్లడించారు. స్థానికుల బెదిరింపుల కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలనుార్పి, బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.