కొత్తపల్లి గ్రామంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారం: హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గత కొన్ని నెలలుగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించిందని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను గుర్తించి ఎన్పీడీసీఎల్ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. దీంతో విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.