చింతగూడలో తమ గ్రామం కోసం డెడ్ బాడీ ఫ్రీజర్ను విరాళమిచ్చిన పూర్వ విద్యార్థులు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ జడ్పీ పాఠశాల టెన్త్ పూర్వ విద్యార్థులు గ్రామ మేలు కోసం డెడ్ బాడీ ఫ్రీజర్ ను అందజేశారు. ఆదివారం వారు గ్రామసర్పంచ్ సుతారి సుమలత వినయ్ సమక్షంలో డెడ్ బాడీ ఫ్రీజర్ ను గ్రామపంచాయతీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, టెన్త్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.