స్వచ్ఛరథం సేవలతో ప్రథమ స్థానంలో నిలిచిన వింజమూరు మండలం
రిపోర్టర్: సతీష్
స్థలం: వింజమూరు
ఇళ్లలోని పొడి వ్యర్థాలను సేకరించి నిత్యావసర వస్తువులు అందిస్తున్న స్వచ్ఛరథం నిర్వహణలో వింజమూరు మండలం రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీడీవో కె. శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. వ్యర్థాల సేకరణ ద్వారా పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో అరవై టన్నులకు పైగా చెత్త సేకరించి అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు.