షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం: బాలీవుడ్ భారీ చిత్రం రామాయణంలో కలకలం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రామాయణం షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బి.ఎన్. తివారీ వెల్లడించారు. స్టూడియో వెలుపల ఏర్పాటు చేసిన చిన్న టెంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, తద్వారా పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన స్పష్టం చేశారు.