నీట్ ఎండీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల

రిపోర్టర్: రాము స్థలం: India

వైద్య ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ ఎండీఎస్ 2026 రెండో విడత కౌన్సెలింగ్ తుది సీట్ల కేటాయింపు ఫలితాలను సెప్టెంబర్ 23న విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీలోపు కేటాయించిన దంత వైద్య కళాశాలల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అభ్యర్థులు విధిగా రిపోర్ట్ చేసి భౌతిక ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.