తెలంగాణలో తీవ్ర కరవుపై అసెంబ్లీలో తీర్మానం ఇరవై వేల కోట్ల ప్యాకేజీ కోరిన ప్రభుత్వం

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్ల ప్రత్యేక సహాయక ప్యాకేజీని ప్రకటించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో రాష్ట్రంలోని 19 జిల్లాల్లో వర్షాభావం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పనిదినాలను 175 రోజులకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ, 8 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.