రాజానగరం స్థానిక సంస్థల ఫలితాలు: అధికార కూటమికి వైఎస్సార్సీపీ గట్టి పోటీ

రిపోర్టర్: శివ స్థలం: Rajanagaram

రాజానగరం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రదర్శన కనబరిచిందని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం స్థానాల్లో ముప్ పై చోట్ల గెలుపొంది సీతానగరం, కోరుకొండ మండలాల్లో పీఠాలను దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సమష్టిగా చేసిన ప్రచారంతోనే ఈ సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని, కూటమి పార్టీల నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ సగానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నట్లు పార్టీ నాయకులు స్పష్టం చేశారు.