కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నవి పచ్చి అబద్ధాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ గానీ, ఒక్క సీటు గానీ ఇవ్వలేదని ఆయన నిలదీశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి వైద్య రంగంలో తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.