భక్తిశ్రద్ధలతో ముగిసిన వినాయక ఉత్సవాలు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా, చిట్వేల్ మండలం లో వినాయక చవితి సందర్భంగా నక్కలపల్లిలో గణేశ్‌ లడ్డూ వేలంపాట ఘనంగా నిర్వహించారు. వేలంపాటలో లడ్డూ రూ.లక్ష ధర పలికింది. నక్కలపల్లి సిద్ధివినాయక గణేశ్‌ యూత్‌, నక్కలపల్లి యూత్‌ సంయుక్తంగా లడ్డూను దక్కించుకున్నాయి. దాత కట్టా వినయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్వామివారి పూజలు, అన్నదానం, ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం గణేశ్‌ విగ్రహ నిమజ్జనం శాంతియుతంగా, అంగరంగ వైభవంగా జరిగింది.