విద్యార్థి నీలాయమ్మ సత్రం భూముల ఆక్రమణలపై దేవాదాయశాఖ మౌనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరం పట్టణంలో దాతల ఉదాత్త ఆశయంతో పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన విద్యార్థి నీలాయమ్మ సత్రానికి చెందిన సుమారు నూట అతొమ్మిది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ మరియు విజయనగరం జిల్లాల పరిధిలోని ఈ భూములు చేతులు మారిపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.