ఉమ్మడి రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వద్ద లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం కూర్మన్నపాలెం వద్ద టిప్పర్ ఢీకొని బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లడంతో మరో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అనకాపల్లి జిల్లా మాకవరం క్వారీలో ట్రాక్టర్ బోల్తాపడి మరో ఇద్దరు మృతి చెందడంతో పలు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.