వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన జోగి నాయుడు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

నక్కపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి సమావేశంలో జోగి నాయుడు మాట్లాడుతూ జెడ్పిటిసి అభ్యర్థి అంకరుడు సౌమ్యను, ఎంపీటీసి అభ్యర్థి అమ్మాజీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని, సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాల ద్వారా నిరంతరం గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.