ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైకాపా జడ్పీటీసి అభ్యర్థి సంజీవరెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పొదిలి
ఎన్నికల్ లో ఒంటరిగా పోరాటం చేయలేనని స్పష్టం చేస్తూ పొదిలి వైకాపా జడ్పీటీసి అభ్యర్థి గుజ్జుల సంజీవరెడ్డి పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. పార్టీ నాయకుల నుంచి సరైన సహకారం అందలేదని, ఎంపీపీ అభ్యర్థులు మరియు ఎంపీటీసీలు లేకపోవడంతో తాను ఒక్కడే బరిలో నిలవలేనని ఆ వీడియోలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.