స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలొద్దని వైసీపీ శ్రేణులకు బొత్స అనూష పిలుపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

చీపురుపల్లిలో జరిగిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష తొలిసారిగా ప్రసంగించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు అనే మాట వినిపించొద్దని, ప్రతిచోటా పోటీ చేసి సత్తా చాటాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఇకపై బొత్స 2.0 పాలన చూస్తారని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆమె కోరారు.