క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
పులివెందుల ప్రాజెక్టుల క్రెడిట్‌ను కూటమి ప్రభుత్వం దొంగిలిస్తోందని వైఎస్సార్సీపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. వైఎస్ జగన్ హయాంలోనే పనులు పూర్తయినా, ఇప్పుడు తాము చేసినట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఇతరుల కష్టాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది.