'సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో చంద్రబాబు': వారణాసి పర్యటనకు ఏపీ సీఎం

రిపోర్టర్: రాము స్థలం: వారణాసి

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు మరియు ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసిలో గురువారం నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వారణాసికి చేరుకోనున్న ఆయన, తొలుత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సేవా యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికి అమరావతికి తిరిగి వస్తారు.