స్పీకర్ దూషణ కేసులో ఎమ్మెల్సీలు తాతా మధు నవీన్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన కేసులో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. నిందితులను అరెస్ట్ చేయొద్దని నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.