గుర్గావ్‌లో మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు
రిపోర్టర్: రాజేష్
స్థలం: హర్యానా
గుర్గావ్‌లో సియా అనే మహిళా బైకర్‌ను కారులో వచ్చిన దుండగులు వెంబడించి ఆమె బైక్‌ను ఢీకొట్టి పరారయ్యారు. గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. నిందితులు మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు.